NDL: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన నేతల శిక్షణ తరగతులకు బనగానపల్లె, కొలిమిగుండ్ల మండలాల నుంచి పలువురు నాయకులు హాజరయ్యారు. అంకిరెడ్డిపల్లెకు చెందిన రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి, నియోజకవర్గ కో-కన్వీనర్ వీఆర్ లక్ష్మిరెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, తదితరులు గురువారం నిర్వహించిన కోఆర్డినేటర్ల శిక్షణలో పాల్గొన్నారు.