KDP: ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణ ఘట్టం ఎలాంటి ఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులు,సిబ్బందిని ఎస్పీ విశ్వనాథ్ అభినందించారు. వేలాది భక్తుల సమక్షంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పోలీస్ శాఖ సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యాల్లో సిబ్బంది నిబద్ధత ప్రశంసనీయమని ఎస్పీ తెలిపారు.