BPT: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధమైన ఆమోదం లభించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చీలు రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, జై అమరావతి నినాదాలతో ఊరంతా మార్మోగింది. ర్యాలీలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు.