AP: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు దంపతులు ఉద్ధండరాయునిపాలెంలో పర్యటించారు. అక్కడ పవిత్ర నీరు, మట్టి ప్రదేశం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమరావతికి వచ్చినవి తాత్కాలిక ఇబ్బందులేనని, చరిత్ర ఉన్నంతవరకు రాజధాని చిరస్మరణీయంగా ఉంటుందని, ఇకపై అమరావతికి అపజయం లేదని సీఎం స్పష్టం చేశారు.