NLG: రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిల్లర్లును ఆదేశించారు. గురువారం పట్టణంలోని పలు రైస్ మిల్ కేంద్రాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రైతులు ధాన్యానికి మద్దతు ధర కల్పించని మిల్లులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం రైతులతో కలిసి ముచ్చటించారు.