ASF: గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామ సభల నిర్వహణ ముఖ్య ఉద్దేశ్యం అని కలెక్టర్ హరిత అన్నారు. గురువారం సిర్పూర్ (టీ) మండలం మేడిపల్లి గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. 2నెలలకు ఒకసారి గ్రామసభలు నిర్వహించి, గ్రామాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.