MLG: తాడ్వాయి మండలం ఊరట్టంలో రైతులకు కూరగాయల విత్తనాల మినీ కిట్లు అందజేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 45 మంది రైతులకు పంపిణీ జరిగింది. సేంద్రియ కూరగాయల సాగుతో ఆరోగ్యం, ఆదాయం పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో ఎకరానికి మంచి లాభం సాధ్యమని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.