దళిత క్రైస్తవులకు SC హోదా కొనసాగించాలని BSP పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మతం మారినా సామాజిక వివక్ష మారడం లేదని, వెంటనే చట్ట సవరణ చేసి హోదా కల్పించాలని కోరారు. అలాగే ఆకివీడు మండలం పెద్దపేట ఘటనలో 42మంది దళిత క్రైస్తవులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్నారు.