TG: హైదరాబాద్లోని బడంగ్పేట్ మున్సిపాలిటీలో రూ.122 కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చింది. GHMC విజిలెన్స్ విచారణలో బాగోతం బయటపడింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. టెండర్ ప్రక్రియను తప్పించేందుకు మున్సిపల్ అధికారులు పనులను విభజించారు. ఈ క్రమంలో 10 మంది అధికారులను కమిషనర్ ఆర్వీ కర్ణన్ సస్పెండ్ చేసి వారికి నోటీసులు జారీ చేశారు.