KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో జరిగిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామసభకు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరయ్యారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.