న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ అమేలియా కెర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనర్ బ్యాటర్‌గా నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసిన ఆమె 139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం చమరి ఆటపట్టు (178*) పేరిట ఉండేది.