ASF: కాగజ్ నగర్ మండలంలోని బారేగూడ గ్రామంలో పాకీజా నగర్లో గల రేషన్ షాపును గురువారం MLA హరీష్ బాబు సందర్శించారు. ఈ సందర్బంగా ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం నాణ్యతను MLA పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకే సారి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.