GDWL: గట్టు మండలం పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో అధికారులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎర్రగట్టు ఒక వ్యక్తికి రిజిస్టర్ అయ్యి ఉన్నట్లు రికార్డులు కనిపించగా, అది గ్రామానికి అవసరం, అభివృద్ధి కోసం ఆ గట్టు ఉండాలని గ్రామస్థులు అన్నారు. ఈ గట్టు ప్రైవేట్ వ్యక్తి చేతికి వెళ్లకూడదని గ్రామ సర్పంచ్ ఉప్పరి దేవేందర్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.