CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీ పరిధిలోని అరవపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్‌కు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారుల నిర్మాణం కీలకమని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.