ADB: బేల మండలం సదల్ పూర్ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా నీటి సరఫరా అధికారి శ్రావణ్ కుమార్తో కలిసి గ్రామంలో పర్యటించారు. ఆలయ సమీపంలో ఉన్న బోర్ నుంచి గ్రామానికి నీటి సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.