AP: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని, ఈ విజయాన్ని అమరావతి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అండగా నిలిచిన ప్రధాని మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొన్న చీకటి రోజులకు ఇది ముగింపు అని, అమరావతే ఆంధ్రుల ఏకైక ప్రజా రాజధాని అని ఆయన స్పష్టం చేశారు.