SRCL: ఇసుక తరలింపులో పారదర్శకత అవసరమని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇసుక తరలింపులో పారదర్శకత కోసం మన ఇసుక మన వాహనం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.