HNK: పరకాల(M) పోచారం గ్రామంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభను ఏర్పాటు చేశారు. గ్రామ సభకు స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మీ, సర్పంచ్ మధుకర్ హాజరయ్యారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పోచారం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావాలని, ప్రజలందరు సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, తదితరులు ఉన్నారు.