TG: రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. చేయూత పథకం కింద కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 2026-27 వార్షిక బడ్జెట్లో రూ.233 కోట్లను కేటాయించడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది.