BDK: దమ్మపేట మండలం కొడిసెలగూడెం గ్రామంలో కుంజా బాలరాజు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారాధ్యంలో పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని ఎమ్మెల్యే జారే తెలిపారు. ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.