NGKL: ప్రతి ఉద్యోగికి జీవితములో ఉద్యోగ విరమణ తప్పదని అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం అచ్చంపేట డిపోలో పనిచేస్తున్న కార్మికులు వెంకటయ్య, తిరుపతయ్య, కృష్ణ, బాలస్వామిల ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు వారిని ఘనంగా పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.