NDL: ఉయ్యాలవాడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ బహిరంగ సభ జరిగింది. మండల అధ్యక్షురాలు బుడ్డా భాగ్యమ్మ అధ్యక్షతన డ్వామా పీడీ సూర్యనారాయణ, విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు పాల్గొన్నారు. 20 పంచాయతీల ఖర్చులపై చర్చించి, డీఆర్పీలు చేసిన సర్వే నివేదికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.