HYD: హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్ల, చర్లపల్లి, బాలానగర్ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో బయోప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ పెరుగుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం తర్వాత పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలపై దృష్టి పెరిగింది. దీంతో ఈ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల వినియోగం విస్తరిస్తూ జీడిమెట్లలో 4 పరిశ్రమలు ఏర్పడ్డాయి.