VZM: జిల్లాలో నిర్మాణంలో గల ఆసుపత్రుల నూతన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో గల భోగాపురం, ఎస్ కోట, నెల్లిమర్ల, బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, బొబ్బిలి ఆసుపత్రుల నూతన భవనాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.