AP: క్యాన్సర్ చికిత్స అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, MLA బాలకృష్ణ అన్నారు. HYDలోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అడ్వాన్స్డ్ ఏఐ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. దీనివల్ల తక్కువ టైంలో కచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. వారం రోజుల్లో తుళ్లూరులో కొత్త ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.