సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం రోద్దం పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్టుపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాత్రి గస్తీ పెంచి నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని, అక్రమ ఇసుక రవాణా, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.