కృష్ణా: గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిపై MLA యార్లగడ్డ వెంకట్రావు హైదరాబాద్ సైంటిఫిక్ బృందంతో కీలక భేటీ మంగళవారం నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాల వంటి మౌలిక వసతులపై చర్చించారు. బ్రహ్మలింగం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ఎకో టూరిజం, సోలార్ వినియోగంపై ప్రణాళికలు రూపొందించారు.