KRNL: క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని నోడల్ అధికారి డాక్టర్ రఘు అన్నారు. మంగళవారం నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్వైకల్ గర్భాశయ ముఖ ద్వారము క్యాన్సర్ గురించి ఆయన మాట్లాడుతూ.. పొత్తి కడుపు నొప్పి, నెలసరికి మధ్య రక్తస్రావం, మెనోపాజ్ తరువాత రక్తస్రావం ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.