SRPT: తిరుమలగిరి మండలం రాఘవాపురం గ్రామంలో జరుగుతున్న దుర్గమ్మ తల్లి పండుగలో మంగళవారం ఎమ్మెల్యే సామేలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు.