అనకాపల్లి జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23 వరకు ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించనున్నట్లు డీఐఈఓ వినోద్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు జరుగుతాయని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థులు జాయినింగ్స్కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.