NDL: విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులకు ఇవాళ ఆదేశించారు. మూడు నెలల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఫీడర్ ఛానల్స్ శుభ్రపరిచే పనులు, పూడికతీత పూర్తి చేయాలని తెలిపారు. చెరువుల కట్టల్లో గండ్లు, ఇతర నష్టాలను వెంటనే మరమ్మతు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.