MDCL: హనుమాన్ విజయోత్సవ ర్యాలీల నేపథ్యంలో అల్వాల్ పోలీస్ స్టేషన్లో అల్వాల్ ఎస్హెచ్వో ప్రశాంత్ ఆధ్వర్యంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ర్యాలీ మార్గాలు, భద్రత, సమయాల పాటింపు, శబ్ద నియంత్రణపై చర్చించారు. ర్యాలీలు శాంతియుతంగా జరగడానికి పోలీసులకు సహకరిస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చారు.