SDPT: బెజ్జంకిలో ఏఎస్సైగా సేవలందించిన సింగీతం శంకర్ రావు మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆయనను శాలువా కప్పి, మెమెంటోతో సన్మానించారు. 1990లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన, 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2023లో ఏఎస్సైగా పదోన్నతి పొంది విశిష్ట సేవలందించారు. సేవాకాలంలో 9 క్యాష్, 7 క్రైమ్ రివార్డులు పొందారు.