E.G: గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో పండిట్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ -2026 కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మండల ప్రశిక్షణలో కార్యపద్దతి కాలాంశం వక్తగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షుడు కాలేపు సత్య సాయిరాం పాల్గొని మాట్లాడారు. పార్టీ కార్యాచరణ అంశాలు, దేశభక్తి, సాంస్కృతిక జాతీయ భావజాలాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలన్నారు.