HNK: కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల స్టడీ టూర్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మార్కెట్ యార్డులను మార్కెట్ కమిటీ సభ్యులు సందర్శించి కమలాపూర్ మార్కెట్ యార్డు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అక్కడ అధికారులతో చర్చించారు. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు.