TPT: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం వసంతోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు ఈ వేడుకలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.