TG: ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణాలు 10 కోట్లు పూర్తి సందర్భంగా జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో ‘మహాలక్ష్మి వేడుకలు’ నిర్వహించారు. ఉచిత బస్సు విషయంలో కొందరు మహిళలను అవమానిస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఈ ప్రభుత్వం ఒక్కటి మాత్రమే అమలు చేయలేదని.. పెండింగ్లో ఉన్న ఒక్క హామీని త్వరలోనే అమలు చేస్తామని సీతక్క స్పష్టం చేశారు.