SRCL: వంట గ్యాస్ వినియోగదారులు అవసరం మేరకు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్ బుచ్చిబాబు అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ప్రకటన ఓ విడుదల చేశారు. జిల్లాలో తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన పడవద్దన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, రూరల్ పరిధిలో 45 రోజులలోపు గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవుతాయన్నారు.