NGKL: అచ్చంపేట మండలంలోని అంకిరోనిపల్లి సర్పంచ్ సతీష్‌పై జరిగిన దాడి నేపథ్యంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకుని బాధితుడిని పరామర్శిస్తారు. ఈ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.