AP: సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఉత్పత్తి వ్యయం తగ్గి, చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.