MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్లు, డ్రైనేజీలు, వీధి బల్బుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కార్యక్రమంలో ఛైర్మన్ బాలకోటి పాల్గొన్నారు.