PPM: గుమ్మలక్ష్మీపురంలో బెందాలం అశోక్ గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆదివాసి సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండించింది. మార్చి 26న జరిగిన ఘటనలో గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని పేర్కొంటూ, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే తదుపరి చర్యలు చేపడతామని హెచ్చరించింది.