TG: ఓ హత్య కేసులో కరీంనగర్ జిల్లా కోర్టు 15 మందిని దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. చెరువులో చేపలు పట్టే విషయంలో 2019 ఏప్రిల్ 19న చామనపల్లి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అతడిని కొట్టి చంపినట్లు నిందితులపై కేసు నమోదైంది.