AP: అమరావతిలోని నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. TDP ఆవిర్భావం నుంచి సేవలందించిన కార్యకర్తలను విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యకర్తల ఆరోగ్య, కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల పోరాటాలు, త్యాగాలు మర్చిపోలేమని CM అన్నారు.