శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో దర్శకుడు అభిలాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘తండ్రీకొడుకుల ఎమోషన్స్, రేసింగ్ నేపథ్యంలో సాగే మూవీ ఇది. దీని కోసం శర్వా 6 నెలలు ఫిజికల్, మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాడు. 23 KGల బరువు తగ్గాడు. ఈ సినిమా తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అని అన్నాడు.