VZM: జిల్లా జర్నలిస్టులకు వైద్య ఆరోగ్య పరీక్షలు రెండో రోజు కొనసాగాయి. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వైద్య పరీక్షలకు మొత్తం 20 మంది హాజరై, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి గోవిందరాజులు పర్యవేక్షించారు.