MDK: వెల్దుర్తి మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ.. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు రాత్రి సమయంలో గస్తీలు, వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.