SRPT: రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని పట్టణ సీఐ వెంకట్ అన్నారు. ఆదివారం ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల జంక్షన్ వద్ద ‘అరైవ్ – అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని హెచ్చరించారు.