ATP: కళ్యాణదుర్గాకి చెందిన శ్రీధర్ కుమార్తె నాగ కౌస్తుభ ఇంజినీరింగ్ చదువు కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం ప్రజావేదికలో స్థానిక కౌన్సిలర్ రాధికా రాణి సమక్షంలో కళాశాల ఫీజు నిమిత్తం ఈ మొత్తాన్ని విద్యార్థినికి అప్పగించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి పేద విద్యార్థులను ఆదుకోవడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.