JN: చిల్పూరు మండల కేంద్రంలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ… మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, మహిళా సాధికారతకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. బీజేపీ మండల నేతలు, తదితరులు పాల్గొన్నారు.